15-01-2026 01:46:34 AM
తనదైన అందం, అభినయంతో ప్రేక్షకాభిమానుల్లో చెరగని ముద్ర వేసిన నటభూషణ శోభన్‌బాబు. అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి పేరిట ఆయన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ‘సోగ్గాడు’ సినిమా స్వర్ణోత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం శోభన్‌బాబు జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించిన యువ హీరో ఒకరికి ఈ ఏడాది నుంచి ‘సోగ్గాడు శోభన్‌బాబు అవార్డు’ పేరిట పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్‌బాబు ప్రకటించారు. ఈ ఏడాది ఈ అవార్డుకు యువ హీరో సిద్దు జొన్నలగడ్డను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.