30 June, 2026 | 1:44 AM

బండరావిరాల డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి

30-06-2026 12:00 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 29 (విజయక్రాంతి): అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బండరావిరాల పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్’ను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు.ఈ నిరసనలో పాల్గొన్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, క్యామా మల్లేష్, దండెం రాంరెడ్డి మాట్లాడుతూ.. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

ఈ ప్రాజెక్టు వల్ల పరిసర గ్రామాల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, వెంటనే దీన్ని అటవీ ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 15 గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.