calender_icon.png 8 January, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిశబ్దంగా పెరుగుతున్న కిడ్నీ వ్యాధి

05-01-2026 12:00:00 AM

  1. తెలియకపోతే ప్రమాదమే..

కిమ్స్ గౌచ్చిబౌలి ఆధ్వర్యంలో సైక్లోథాన్

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిట ల్స్ సీఎండీ డా.భాస్కర్‌రావు సూచించారు. కిమ్స్ హాస్పిటల్స్ గౌచ్చిబౌలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైక్లోథాన్‌ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయన్నా రు.

ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా షుగర్ వ్యాధి వస్తుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమతప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవలన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ గౌచ్చిబౌలి డాక్ట ర్ శ్రీకాంత్ బత్తిని, సీనియర్ కన్సల్టెంట్ నె ఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ మాట్లాడుతూ.. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (పీకేడీ) అనేది ఒక జన్యుపరమైన  కిడ్నీ వ్యాధి. ఇది ప్రతి వెయ్యి మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది.

నిశ్శబ్దంగా  ఈ వ్యాధి పెరిగి పోతుందన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆటోసో మల్ రిసెసివ్ పీకేడీ చాలా అరుదైనది. శిశువులు లేదా చిన్న పిల్లలలో కనిపిస్తుంది. ఈ వ్యాధి తెలియకపోతే చాలా ప్రమదానాకి గురవుతాము, ఒక వేళా తెలిస్తే నివారణ చేయవచ్చన్నారు.

ఈ వ్యాధిని పురోగతిని తగ్గించడానికి ఉత్తమమైన మందులు కూడా కిమ్స్ గచ్చిబౌలి లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముందు తరకాలకు వ్యా పించకుండా అరికట్టవచ్చాన్నారు. రక్తపోటును నియంత్రించడం, సరైన ఆహార నియ మాలు పాటించడం, నొప్పి, ఇన్ఫెక్షన్లకు సమయానుకూల చికిత్స, నిపుణుల పర్యవేక్షణ వంటి చర్యలతో వ్యాధి తీవ్రతను నెమ్మదింపజేయవచ్చు.

దీనికోసం ప్రజల్లో అవగాహ న పెంచడానికి హైదరాబాద్ స్లైక్లిస్ట్ గ్రూప్ సహాకారంతో కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి ఆధ్వర్యంలో ఈ సైక్లోథాన్ నిర్వహించామన్నారు. సైక్లోథాన్ కిమ్స్ హాస్పిటల్స్, గచ్చిబౌ లి నుంచి ఖాజాగూడ ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు సాగింది. కార్యక్రమంలో డా. అంకిత చావ్లా, అసోసియేట్  మెడికల్ డైరెక్టర్, కిమ్స్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఆదర్శ్ అన్నపురెడ్డి, మిస్టర్ గుంజన్ యూవీ (సీఓఓ, కిమ్స్ హాస్పిటల్స్, గచ్చిబౌలి), నెఫ్రాలజిస్ట్ డా. స్వర్ణలత, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. శ్రీనివాస్ బొప్పరాజు, డా. ప్రసన్నతో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ సైక్లి స్ట్స్ గ్రూప్ సభ్యులు, కిమ్స్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.