calender_icon.png 7 January, 2026 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగి కోలుకోవడమే కీలకం

05-01-2026 12:00:00 AM

  1. న్యూరోసర్జరీల తర్వాత రీహాబిలిటేషన్ అవసరం
  2. ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు
  3. అనంత రీహాబ్ రెండో వార్షికోత్సవంలో టీఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సీఎంఈ

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : న్యూరోసర్జరీల అనంతరం చేసే రీహాబిలిటేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని, ఆ విషయంలో ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా ఈ రంగంలో పురోగతి సాధించవచ్చని వక్త లు పేర్కొన్నారు. న్యూరోసర్జరీలు, ఇతర ప్రధాన శస్త్రచికిత్సల అనంతరం రోగులను సాధారణ స్థితికి తీసుకురావడంతో రెండేళ్ల పాటు చేస్తున్న నిరంతర కృషి సందర్భంగా అనంత ఎంకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఫ్రాంటియర్స్ ఇన్ పెయిన్ అండ్ న్యూరో రీహాబిలిటేషన్ అనే అంశంపై కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దీనికి తెలంగాణ న్యూరో సైన్సెస్ సొసైటీ (టీఎన్‌ఎస్‌ఎస్) తన సహకారం అం దించింది.

నొప్పి నివారణ వైద్యం, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, రీహాబిలిటేషన్ సైన్సెస్ రంగాలకు చెందిన దాదాపు 200 మంది వరకు వైద్యనిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అనంత ఎంకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ ఆనందరావు, సీఈఓ డాక్టర్ ఎం చంద్రశేఖర్, టీఎన్‌ఎస్‌ఎస్ కార్యదర్శి డాక్టర్ ఎన్ ప్రతాప్‌కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ, నొప్పి నివారణ, న్యూరో రికవరీ అనేవి ఇక కేవలం వైద్యానికి సంబంధించినవి మాత్రమే కాదు. మనమంతా ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాం. వీటికి సమన్వయంతో కూడిన ప్రయత్నాలు అవసరం. అర్థవంతమైన సహకారంతో భవిష్య త్తును తీర్చిదిద్దడం ఎలాగన్నది ఈ సీఎంఈలో క్షుణ్ణంగా వివరిస్తున్నాం అని చెప్పా రు.     

సీఎంఈ కార్యక్రమం, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్, న్యూరో రిహాబిలిటేషన్ రంగాల్లో ముందంజలో ఉన్న నిపుణుల నేతృత్వంలో నిర్వహించిన రెండు కీలక క్లినికల్ సెషన్లతో వైద్యులందరినీ ఆకట్టుకుంది.

కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి, నిమ్స్ ఆస్పత్రి న్యూరాలజీ విభాగా ధిపతి డాక్టర్ సూర్యప్రభ, ఉస్మానియా వైద్య కళాశాల న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధరాల శ్రీనివాస్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కారుమూరి అనూష, కిమ్స్ ఆస్పత్రి న్యూరో ఫిజియోథెరపిస్ట్ డాక్ట ర్ అజయ్ కుమార్ మిద్దె, శ్రీకృష్ణ న్యూరో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ టి.వి. శ్రీనివాస్, సంగారెడ్డి వైద్యకళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్  ప్రకాష్ రావు, టీఎన్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు డాక్టర్ జి.సత్యనారాయణ అభిప్రాయాలు వెల్లడించారు.