05-01-2026 12:00:00 AM
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : శబరిమలలోని నీ లెక్కల్ మార్గంలో శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి, అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. బాస్ సేవలను, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అభి నందనీయమని రాజ్యసభ సభ్యుడు, ఎం అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. శబరిలో అయ్యప్ప స్వాముల కోసం శ్రీ భాగ్యన గర్ అయ్యప్ప సేవా సమితి ఏటా అన్నదానం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
గత 20 ఏళ్లుగా అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారన్నారు. ఆదివారం ఉస్మాన్ గంజ్‌లోని శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి అధ్యక్షుడు మేడిశెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శి భద్రేశ్వర్, కోశాధికారి సిఏ అనిల్ నాయర్‌ల నేతృత్వంలో బాస్ కార్యాలయం నుంచి అన్నదానంకు సంబందించిన వంట సామగ్రి లారీని ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ అన్నదానం, అల్పాహారం, మంచినీరును, జనవరి 7 నుండి 14వ తేదీ వరకు శబరిమల నీల్ కల్ వెళ్లే మార్గంలో అయ్యప్పలకు అందించనున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. బాస్ సంస్థ అధ్యక్షులు మేడిశెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శి, భద్రేశ్వర్ మాట్లాడుతూ.. శబరిలో ప్రతి రోజు 20 వేల మంది అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు.
ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రతి అయ్యప్ప భక్తుడు సద్విని యోగపర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాస్ ప్రతినిధులు, విజయ భాస్కర్, విజయేందర్‌రెడ్డి, దేవత ఓంకార్ గుప్తా, నార్ల జగదీష్, నర్సింగ్ రావు, వెంకటేశం గురుస్వామి, క్యాతం రాధాకృష్ణ, కట్ట హరికృష్ణ, నరేష్ పటేల్, శ్రీహరి, వేణుగోపాల్, కాంగ్రె స్ నాయకులు ఎస్, ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.