గిన్నిస్ రికార్డులో సిలికానాంధ్ర మనబడి
1712 మందితో మాతృభాష గొప్పతనాన్ని చాటిన విద్యార్థులు
హైదరాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాం డ్ మాతృసంస్థ సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అతిపెద్ద తెలుగు పద్య సమూహ పారాయ ణం ద్వారా కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో సిలికానాంధ్ర మనబడి విద్యా ర్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు విశేష పాత్ర పోషించారు.
ఈ అపూర్వ విజయంతో ప్రపంచ వేదికపై తెలుగు భాష గొప్పతనాన్ని చాటిన సిలికానాంధ్ర మనబడి, గిన్నిస్ ప్రపంచ రికార్డు విజయోత్సాహంతో 2026-27 విద్యా సం వత్సరానికి ప్రవేశాలను ఆహ్వానిస్తోంది. ఈ చారిత్రాత్మక పద్య సమూహ పారాయణం లో మొత్తం 1,712 మంది పిల్లలు, పెద్దలు పాల్గొని సుమతీ, వేమన శతకాల నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను ఏకకాలంలో కంఠస్థంగా పారాయణం చేసి, తమ తెలుగు భాషా ప్రావీణ్యాన్ని మాత్రమే కాకుండా తె లుగు సాహిత్యం, సంస్కృతిపై తమకున్న గాఢమైన అనుబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ప్రెసిడెంట్ డీన్ చామర్తి రాజు మా ట్లాడుతూ, గిన్నిస్ ప్రపంచ రికార్డు వేదికపై 1,712 మంది కలిసి తెలుగు పద్యాలను పా రాయణం చేయడం మనబడి ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న భాషా సేవకు సజీవ నిదర్శనం అన్నారు.ఆ వేదికపై గర్వంగా నిలిచిన వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, పూర్వ విద్యార్థుల ప్రయాణం ఒక మనబడి తరగతి గదిలోనే ప్రారంభమైంది.
ఈ గర్వానుభూతిని రాబోయే తరా లు కూడా అనుభవించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు అమెరికాలో నివసిస్తున్న తమ పిల్లలను ప్రో త్సహించి, మనవలు, మనవరాళ్లు తప్పనిసరిగా మనబడిలో చేరి మాతృభాషను నేర్చు కునేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నా రు. కాగా 2026- 27 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రస్తుతం కొనసాగుతున్నా యి. అమెరికా, కెనడా దేశాలలోని 250కు పైగా కేంద్రాల్లో సెప్టెంబర్ 2026 మొదటి వారాంతం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.






