calender_icon.png 15 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పై పై కి వెండి ధరలు

15-01-2026 01:57:54 AM

హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర 2,88,300

గత రికార్డులన్నీ బ్రేక్.. గరిష్ఠ స్థాయికి ధరలు

ఒక్క రోజులోనే రూ.12,803 పెరుగుదల

గడిచిన నాలుగు రోజుల్లో రూ.౩౫ వేలు పెరిగిన ధరలు  

న్యూఢిల్లీ, జనవరి ౧౪: వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి రూ.2,88,300 పలుకుతున్నది. తద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం కంటే ఒక్క రోజులోనే రూ.12,803 మేర ధర పెరగడం గమనార్హం. గడిచిన నాలుగు రోజుల్లోనే వెండి ధర ఏకంగా రూ.35 వేలకు పెరిగింది. మరోవైపు బంగారం తులం ధర రూ.1.43 లక్షల వద్ద ట్రేడవుతున్నది. మునుపెన్నడూ లేని గరిష్ఠ స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,600 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి 90 డాలర్ల ఎగువన ట్రేడ్ అవ్వడం దేశీయ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.