17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇల్లందు ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

11-06-2025 12:37 AM

ఇల్లెందు, జూన్ 10 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియా లో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెకట్స్& ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు, జి.యం (క్వాలిటీ) కనకయ్య మంగళవారం  ఇల్లందు ఏరియా లోని జెకె-5 ఓసీ, నూతన జే.కే కోల్ మైన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్థలాలను పరిశీలించారు.

ఈ సందర్బంగా వారు తొలుత జే కె ఓసీ పని స్థలాలను  సందర్శించి అక్కడ జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను ఎస్ ఓ టు జి.యం. రామస్వామిని అడిగి తెలుసుకున్నారు. తరువాత వారు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి , రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించాలని, బొగ్గు ఉత్పత్తి , రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అలాగే బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జి.13 బొగ్గు ఉత్పతి ఐయే లాగా  చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని అన్నారు.

తరువాత నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించి రివ్యూ చేపట్టారు. నూతన ఓ.సి కి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి బొగ్గు రవాణా జరిగేటట్లు చూడాలని ఎస్ ఓ టు జి.యం కు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో జే.కే కోల్ మైన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎ.కృష్ణ మోహన్ రావు, కోయగూడెం పి.ఓ  గోవింద రావు,  ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.