కరీంనగర్ నగరంలో గాడి తప్పిన ప్రభుత్వపాలన: సీపీఐ
కరీంనగర్ క్రైం, జూన్ 10 (విజయ క్రాంతి): కరీంనగర్ నగర ప్రజలకు తమ సమస్యలు విన్నవించుకుందామంటే దిక్కులేని దుస్థితి ఉందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధి కరీంనగర్లో లేకపోవడంతో పాలన గాడి తప్పిందని సీపీఐ నాయకులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజివ్ యువ వికాస్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంటే కరీంనగర్ నగరంలో మాత్రం మొద్దు నిద్రలో అధికార పార్టీ ఉందని విమర్శించారు.
నగరంలోచాలామందికి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు బిల్లు అమలు కావడం లేదని, గ్యాస్ డబ్బులు బ్యాంకులో పడడం లేదని ఇది చాలా దుర్మార్గమని వెంటనే కరీంనగర్ నగరంలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని లేకుంటే ప్రజాగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురకక తప్పదని హెచ్చరించారు.






