calender_icon.png 12 May, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆసుపత్రికి పూర్వ వైభవం

10-05-2025 12:00:00 AM

  1. అందుబాటులోకి మెరుగైన సేవలు.. వైద్య పరికరాలు 

త్వరలో రెఫర్ సేవలు.. మరింత మంది డాక్టర్లు, సిబ్బంది రాక

డీవైసీఎంవో మధుకుమార్ వెల్లడి

బెల్లంపల్లి అర్బన్, మే 9 :  బెల్లంపల్లి సిం గరేణి ఏరియా ఆసుపత్రికి మంచి రోజులు రానున్నాయి. అత్యధిక పరికరాలు,వైద్య నిపుణులతో ఇకనుంచి కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు అందనున్నాయి. ఇటీవలనే నూతనంగా బాధ్యతలు చేపట్టిన సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ సింగరేణి ఆసుపత్రుల పూర్వైభానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

ఇదే విషయాన్ని ఇటీవలనే బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మధుకుమార్ పూర్తిస్థాయిలో వైద్య సేవలతో బెల్లంపల్లి ఆసుపత్రిని తీర్చిదిద్దడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి ఆవరించనున్న మహర్దశను శుక్రవారం బెల్లంపల్లి డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ మధు కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

బెల్లంపల్లికి బదిలీపై వచ్చి తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏరియా ఆసుపత్రి అన్ని విషయాల్లో అధ్వానంగా తయారైంద ని వాపోయారు. ఒక ప్రణాళిక బద్ధంగా ఆసుపత్రిని అన్ని విధాలుగా తీర్చిదిద్దడంప దృష్టి పెట్టానన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం కల్పించడమే తన ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్నాని పేర్కొన్నా రు. కార్మిక కుటుంబాలకు వైద్యం విషయంలో ఏ విధమైన లోటు లేకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలు సింగరేణి ఆసుపత్రిలో ఇకనుంచి ఉంటాయన్నారు. వైద్యు ల కొరత త్వరలోనే తీరిపోతుందన్నారు.

వైద్యనిపుణుల సేవలు ప్రతి మంగళ, శుక్రవారం అందుబాటులో బెల్లంపల్లి ఆస్పత్రిలో ఉంటాయన్నారు.డిప్యూటేషన్‌పై ఇంకా పలువురు వైద్యులను రప్పిస్తున్నామన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం రెఫర్ సేవలు కూడా ఉంటాయన్నారు. గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, మానసిక వైద్య, ఇతర వైద్య నిపుణుల సేవలు ఆసుపత్రిలో రోగులకు అందుతాయన్నారు.

సింగరేణి సీఎంఓ కిర ణ్ రాజ్ బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ్ కుమార్ రెడ్డి బెల్లంపల్లి ఆసుపత్రి  వైద్య సేవలకి ఎలాంటి లోటు లేకుండా తగిన చేయూ తను ఇస్తున్నారన్నారు. ఇప్పటికీ బెల్లంపల్లి ఆస్పత్రిలో పదిమంది వైద్యులు, 90 మంది సిబ్బంది ఉన్నారన్నారు.

ఇంకా డాక్టర్లు, సిబ్బంది వస్తారని, అలాగే  ఆధునికవైద్య పరికరాలను ఆసుపత్రిలో సమకూర్చినట్టు పేర్కొన్నారు. బెల్లంపల్లిలో ఉంటూనే వివిధ దూర ప్రాంతాల గనుల పని చేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు  24 వేల మంది వరకు ఉంటారన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకి వైద్య సేవలు బెల్లంపల్లిలో పొందుతున్నారన్నారు.