calender_icon.png 16 July, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి- రామగుండం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి

16-07-2025 05:01:32 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి రామగుండం ప్రధాన రహదారి పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేటలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రామకృష్ణ పూర్, మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు గండ్ల సత్యం అతని కూతురు గండ్ల లావణ్య వారి స్వగ్రామం ఓదెలకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ  అప్పన్న పేట వద్ద లారీ ఢీ కొట్టడంతో  సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురుకి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు కరీంనగర్ కు తరలించారు.