14-11-2025 05:55:27 PM
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోనసాగుతోంది. బీహార్ లో అధికార దిశగా ఎన్డీయే ప్రభుత్వం దూసుకెళ్తోంది. మిథిలాంచల్ ప్రాంతంలో కీలకమైన అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి, ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్ తొలిసారి పోటీచేసి విజయం సాధించారు. సాయంత్రం 4 గంటల వరకు ఠాకూర్ 20 రౌండ్ల లెక్కింపు తర్వాత 6,954 ఓట్ల ఆధిక్యంలో 70,044 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి, ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రా 63,090 ఓట్ల వెనుకబడి ఉన్నారు. ఈ సందర్భంగా మైథిలి ఠాకూర్ మాట్లాడుతూ.. తాను సాధించిన విజయం ఒక కలలా అనిపిస్తోందని, ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన్నానని అన్నారు.