calender_icon.png 7 November, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశభక్తిని చాటిన 'వందేమాతరం' సామూహిక గీతాలాపన

07-11-2025 09:52:57 PM

తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ

​నూతనకల్,(విజయక్రాంతి): ​భారత జాతీయ గీతమైన 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజున సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తో కలిసి దేశభక్తిని ఉట్టిపడేలా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.​ ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, వందేమాతరం గీతం యొక్క చారిత్రక ప్రాధాన్యతను కొనియాడారు. "వందేమాతరం" కేవలం ఒక పాట కాదని, అది దేశభక్తి, జాతీయత భావాలను ప్రతిబింబించే ఒక శక్తివంతమైన నినాదమని, భారత స్వాతంత్ర్యోద్యమంలో ఈ గీతం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ వంశీ రాజుతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.