07-11-2025 09:50:22 PM
ఉల్లాసంగా..ఉత్సాహంగా రెండో రోజుకు చేరిన క్రీడలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో నిర్వహిస్తున్న 11వ జోనల్ స్థాయి బాలికల క్రీడా పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. 5వ జోన్ పరిధిలోని 9 పాఠశాలలకు చెందిన 765 మంది క్రీడాకారులు స్పోర్ట్స్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటా పోటీగా తలపడుతున్నారు. రెండవ రోజు శుక్రవారం నిర్వహించిన క్రీడా పోటీల్లో పలువురు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటారు.
అండర్- 14 విభాగం చెస్ సింగిల్ బి.శరణ్య (ఆలేరు), అండర్ 17 విభాగంలో కె. కుశాలి (జాజిరెడ్డిగూడెం); అండర్ 19 విభాగంలో కె అర్చన (ఆలేరు); క్యారం డబుల్ అండర్ 14 విభాగంలో అక్షయ (అడ్డగూడూరు); అండర్ 17 విభాగంలో దీక్షిత (నర్మెట్ట); అండర్ 19 విభాగంలో సి హెచ్ స్పందన (జాజిరెడ్డిగూడెం); అథ్లెటిక్స్ అండర్ 14 విభాగంలో 400 మీటర్స్ కె రమ్య (తుంగతుర్తి); అండర్ 17 విభాగంలో తేజశ్రీ (ఆలేరు); అండర్ 19 విభాగంలో గ్రీష్మ (ఆలేరు);600 మీటర్స్ అండర్ 14 విభాగంలో నాగ పూజిత (పాలకుర్తి);1500 మీటర్స్ విభాగంలో అండర్ 17 తేజశ్రీ (ఆలేరు); అండర్ 19 విభాగంలో దివ్య (ఆలేరు);3000,5000 మీటర్స్ పరుగు పందెంలో విభాగంలో అండర్ 17 హాసిని (పాలకుర్తి); అండర్ 19 విభాగంలో వైశాలి (వలిగొండ);
షాట్ పుట్ విభాగంలో అండర్ 14 కళ్యాణి (అడ్డగూడూరు) అండర్ 17 విభాగంలో త్రివేణి (ఆలేరు); అండర్ 19 విభాగంలో జయశ్రీ (వలిగొండ); డిస్కస్ త్రో అండర్ 14 విభాగంలో నాగ పుష్ప (పాలకుర్తి); అండర్ 17 విభాగంలో త్రివేణి (ఆలేరు); అండర్ 19 లక్ష్మీ ప్రసన్న (జాఫర్గడ్); బాల్ బ్యాట్మెంటన్ అండర్ 17,19 విభాగంలో వలిగొండ విద్యార్థినిలు మొదటి స్థానంలో నిలువగా కబడ్డీ అండర్ 14 మొదటి స్థానంలో పాలకుర్తి; రెండవ స్థానంలో వలిగొండ; అండర్ 17 మొదటి స్థానంలో జాజిరెడ్డిగూడెం; రెండవ స్థానంలో తుంగతుర్తి నిలిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కే.సంధ్యారాణి, జోనల్ స్పోర్ట్స్ ఓవరాల్ ఇన్చార్జి పిడి జ్యోతిర్మయి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రిన్సిపాల్ లు, పీడీలు, పీఈటీ లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.