calender_icon.png 24 January, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటి దర్శకులు సినిమాలు అద్భుతంగా తీస్తున్నారు: రాఘవేంద్రరావు

22-01-2026 11:50:58 PM

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్‌కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు సంబంధించి రెండు సీజన్లు ‘ఈటీవీ విన్’లో ప్రేక్షకాదరణ పొందాయి. తాజా రెండ్లు సీజన్లను కలిపి ‘కానిస్టేబుల్ కనకం-చాప్టర్3: కాల్ ఘాట్’ పేరుతో సినిమాగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ మేరకు దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినిదత్ ఈ మూవీ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “ఇప్పటి దర్శకులు సినిమాలు చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కూడా చాలా చక్కగా తీశాడు. ‘కానిస్టేబుల్ కనకం’ ప్రతి సీజన్ ‘బాహుబలి’లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నా” అన్నారు. ‘ఈ యూనిట్ మాకు చాలా కొత్తగా అనిపించింది.

తప్పకుండా ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా’నని అశ్వినీదత్ చెప్పారు. వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. “చాప్టర్ 3 కాల్ ఘాట్’ చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. నటిగా చాలా సంతృప్తినిచ్చిన సిరిస్ ఇది” అన్నారు. ‘కాల్ ఘాట్’ చాలా ఇంపాక్ట్ ఫుల్‌గా ఉండబోతుంది. అందరినీ అలరించబోతోంద’ని డైరెక్టర్ ప్రశాంత్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో ఈటీవీ విన్ సాయికృష్ణ, రాజీవ్ కనకాల, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి మాట్లాడారు.