calender_icon.png 6 September, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా చెరువులోకి నీళ్లు ఇవ్వండి సారూ

06-09-2025 12:27:36 AM

తంగళ్ళపల్లి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపెల్లి మండలం వర్షాలు పడి మత్తడులు దుంకుతున్న తూముల ద్వారా నీళ్లు రావడం లేదని మల్లాపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తంగళ్లపెల్లి మండలం మల్లాపూర్ గ్రామస్తులు ఇంద్రనగర్ నక్క వాగు ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...

వర్షాలు పడి మత్తడులు దుముకుతున్న కానీ మూడు తూముల కాలువలు ద్వారా నీళ్లు రాకపోవడం రైతులందరూ ఆవేదన గురి అవుతున్నారు. చెరువులోనికి నీళ్లు వచ్చే తూము మూసి వేయబడింది. అందులో నుండి నీళ్లు రావడం లేదని ఏ కాలమైనా ఆ యొక్క కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం వల్ల చెరువులకు నీళ్లు లేకపోయాయి. మా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి.

గత ఎండాకాలంలో కూడా మేము అధికారులకు తెలిపిన పట్టించుకున్న పాపన పోలేదు.ప్రస్తుత అధికారులు స్పందించి ఆ యొక్క తూము విడిచి నీళ్లు రావడానికి సహకరించాలని అధికారులను కోరుతున్నారు.

దీనివల్ల మల్లాపూర్, దేశ పల్లె ,అంకిరెడ్డి పల్లె, దాదాపు 1000 ఎకరాల పంట పొలాలకు నీరు అందుతుందని వివరించారు. దయచేసి అధికారులు స్పందించి అట్టి తూమును విడిచి కాలువల ద్వారా మా యొక్క చెరువులోనికి నీళ్లు నింపుకోవాల్సిందిగా అధికారులను వేడుకుంటున్నారు.