25-07-2025 12:00:00 AM
మాతోనే ఉండాలంటూ రోడ్డుపై రోదించిన చిన్నారులు
నాగల్ గిద్ద, జులై 24 : తమకు చదువుతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్తున్నారని తెలిసి విద్యార్థులు కన్నీటి పర్యంత మయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం ముక్తాపూర్ లో చోటు చేసుకుంది. రమేష్ సార్ మమ్మల్ని విడిచి వెళ్ళొద్దంటూ ఉదయం విద్యార్థులు, తల్లి దండ్రులు నారాయణ ఖెడ్ - కరాస్ గుత్తి రోడ్డు పై ఆందోళన చేపట్టారు.
ముక్తాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శేరికర్ రమేష్ ఉపాధ్యాయుడు ఇరాక్ పల్లి పాఠశాలకు అధికారులు ఇటీవల బదిలీ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు తమ పాఠశాలలోనే ఉండాలని ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సన్నివేశం చూసిన స్థానికులు సైతం భావోద్వే గానికి గురయ్యారు.
ఉపాధ్యాయుడు అంటే భయపడే పిల్లలు ఆ ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ కావడం ఇష్టలేని చిన్నారులు అతడిని చూసి ఏడుస్తుంటే అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. మా ఉపాధ్యాయుడు మాకే కావాలని అంటున్నారు. మండల విద్యాధికారి మన్మధ కిషోర్ ఫోన్లో మాట్లాడి హామీ ఇవ్వడంతో మండల ఎస్త్స్ర కాశీపురం రామకృష్ణ అక్కడికి చేరుకొని ధర్నా విరమింపజేశారు. ఏఎస్‌ఐ రవీందర్.ముక్తాపూర్ గ్రామ పెద్దలు మాణిక్ రావు పటేల్, గ్రామ ప్రజలు ఉన్నారు.