25-07-2025 12:00:00 AM
కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తల సంబురాలు
హైదరాబాద్, జులై 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ అభిమానులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది. కేటీఆర్ గురువారం ఉదయమే తెలంగాణ భవన్‌కు చేరుకొని అభిమానులతో తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వచ్చారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సు దూర ప్రాంతాల నుంచి తరలివొచ్చిన వా రందిరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భారీఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం తీర్చుకోలేని చెప్పారు. మీ ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని కేటీఆర్ తెలిపారు.
సైకిళ్ల పంపిణీ..
కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ హైస్కూల్‌లోని 6 నుంచి 10వ తరగతి వర కు చదువులో మొదటి రెండు స్థానాల్లో ప్రతి భ చూపిన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశా రు. కార్యక్రమానికి మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పా స్టర్లతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తలసేమియా బాధితులకు 3 లక్షల చెక్కు అందజేత
కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కు మార్ రెడ్డి తలసేమియాతో బాధపడుతున్న వారికి రూ.3 లక్షల చెక్కు అంద జేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ చేతుల మీదుగా చెక్కు పంపిణీ జరిగిం ది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ బాధితులకు సాయం చేసే ఇలాం టి సామాజిక సేవ కార్యక్రమాలు ఎం తో సంతృప్తిని ఇస్తాయన్నారు.