24-07-2025 11:44:38 PM
జగాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): పేదలకు మెరుగైన వైద్యం అందించాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్(Corporator A. Pavani Vinay Kumar) కోరారు. ఈ మేరకు గురువారం డివిజన్ లోని టిఆర్టి బస్తి దవాఖానను సందర్శించి సదుపాయాలు, పేషంట్ లకు అందిస్తున్న మందుల సౌకర్యాల వివరాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అనారోగ్యంతో వచ్చే వారికి అందచేసే మందులకు కొరత లేకుండా చూడాలని, వర్షాకాలం దృష్ట్యా ప్రభలే సీజనల్ వ్యాధుల నివారణకై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్పొరేటర్ సూచించారు. రోగ నిర్దారణ కొరకు చేసే పరీక్షలు వాటి రిపోర్ట్ లను ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వాటితో పాటు డాక్టర్ లకు, నర్సులకు, ఆశ వర్కర్లకు కల్పించే సదుపాయల్లో లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. అవసరమున్న సదుపాయాలు, సౌకర్యాలు సమకూర్చేందుకు కార్పొరేటర్ గా తాము ఎల్లపుడు ముందుంటానని వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డాక్టర్ లు డా. అవంతి, డా.ప్రవళిక, నర్సు కృపా, ఆశ వర్కర్ దుర్గ తదితరులు పాల్గొన్నారు.