10-09-2025 12:00:00 AM
టేకులపల్లి, సెప్టెంబర్ 9, (విజయక్రాంతి):సిపిఎం మాజీ జాతీయ కార్యదర్శి సీ తారాం ఏచూరి ఆశయాల సాధనకు ఉద్యమిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. మంగళవారం టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ ఈసం నర్సింహారావు అద్యక్షతన జరిగింది.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన ఏచూరి వర్థంతి సభలు జరుపుతున్నామన్నారు, దేశంలో కష్టజీవుల రాజ్యం రావాలని పోరాడిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు, పార్లమెంటులో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా పేరుపొందిన ప్రజా నాయకుడని అన్నారు. గొప్ప మార్క్సిస్టు మేధావిని దేశం కోల్పోయిందన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేదరికం, నిరుద్యోగం తీవ్రంగా పెరిగిందన్నారు.
ప్రజలపై ధరలు పెంచి భారాలు మోపుతుందన్నారు. ప్రజలందరినీ పోరాటాల వైపు నడిపించడమే ఏచూరికిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఈసం నర్సింహారావు, మండల కమిటీ సభ్యులు కడుదుల వీరన్న, పూనెం స్వామి, చంద్రశేఖర్, దొడ్డ సంపత్ కుమార్, దొడ్డ సావిత్రి, కోటేశ్వరరావు, కుంజ రమేష్, భారతమ్మ, చుక్కమ్మ, తదితరులు పాల్గొన్నారు.