calender_icon.png 10 September, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి

10-09-2025 12:00:00 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నట్టు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం నుండి కాల్వపల్లి గ్రామాల మధ్యలో రూ.100 లక్షల రూపాయలతో స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యతతో నిర్మించడంతోపాటు, సకాలంలో  పూర్తయ్యేలా కాంట్రాక్టర్లు,గుత్తేదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల డబ్బుతో జరుగుతున్న ప్రతి పనిలో పారదర్శకత ఉండాలని, అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తూ, ప్రతి గ్రామంలో సమగ్రాభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు.

ఈ  కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మూఖిరాల మధు వంశీకృష్ణ, టేకుమట్ల మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,ఓరం సమ్మయ్య, మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ నాయకుడు దొంతుల శ్రీనివాస్, పంచాతిరాజ్ డీఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.