07-07-2025 12:18:38 AM
అనంతగిరి జులై 6: మండల కేంద్రo లో నూతన పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని గత కొన్ని నెలల క్రితం శంకుస్థాపన చేసినప్పటికీ భవనాలు నిర్వహించేందుకు కావాల్సిన స్థలాన్ని కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి ఆర్డీవో సూర్యనారాయణ తహసిల్దార్ హిమబిందు లతో కలిసి ఆదివారం పరిశీలించారు.
కొత్తగా కార్యాలయమును ఏర్పాటు చేసేందుకు మ్యాప్ పటాన్ని పరిశీలించారు శాంతినగర్ వెళ్ళు రహదారి పక్కన ఉన్న స్థలాన్ని సూచించారు స్థల నిర్ణయంపై అవగాహనకు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మండల ఇంజనీరింగ్ లు, వివిధ శాఖ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉమా శ్రీనివాస్ రెడ్డి, వేనేపల్లి వెంకటేశ్వరరావు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు