09-02-2025 07:54:45 PM
మంత్రులు శ్రీధర్ బాబు, సురేఖ, పొన్నం...
మంథని (విజయక్రాంతి): ప్రముఖ త్రిలింగ క్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయా అభివృద్ధికి పాటుపడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), దేవదయ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha), రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) లు తెలిపారు. కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలో ఆదివారం జరిగిన మహా కుంభాభిషేక మహోత్సవానికి ముగ్గురు మంత్రులు మాట్లాడుతూ.. కాళేశ్వరం అభివృద్ధికి తమ ప్రభుత్వం శాయశక్తుల పనిచేస్తుందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వ పథకాలపై మాట్లాడొద్దన్నారు. మే నెలలో 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 కోట్లు మంజూరు చేసి వివిధ అసంపూర్తిగా ఉన్న పనులు, నూతన పనులను ప్రారంభించి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ... కాళేశ్వరంలో జరుగు పుష్కరాలకు భక్తులకు, మహిళలకు ఇబ్బంది లేకుండా బట్టలు మార్చుకొని గదులు, మరుగుదొడ్లు, వివిధ రకాల పనులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... కాళేశ్వరం పుణ్యక్షేత్రం(Kaleswara Mukteshwara Swamy Temple) దినదిన అభివృద్ధి చెందుతుందని ఈ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నూతన మోడల్ బస్టాండ్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పుష్కరాల కొరకు రాష్ట్రంలోని అన్ని డిపోల నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు బందెల సత్తెమ్మ, మాజీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వామన్ రావు, మాజీ జెడ్పిటిసి అరుణ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.