18-11-2025 12:44:37 PM
కరీంనగర్,(విజయక్రాంతి): అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్ మృతి చెందడంతో, కరీంనగర్ పట్టణంలోని ఆయన నివాసానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మంగళవారం వెళ్లి నివాళులు అర్పించారు. సురేందర్ రెడ్డి భౌతికకాయంపై పూలమాల సమర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన వినోద్ కుమార్ వారికి ధైర్యం చెప్పి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వసంతరావు, వంశీధర్ రెడ్డి, సంపత్, ఓంకార్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.