calender_icon.png 18 November, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మారక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం

18-11-2025 12:49:25 PM

చేవెళ్ల,(విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ఉద్యమంలా ప్రతీ ఒక్కరూ కదిలి రావాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశం మంగళవారం చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎస్.వెంకటేశం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ -2025కు సంబంధించి పురపాలక సిబ్బంది, మహిళా సంఘాల సభ్యుల చేత "మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ" నిర్వహించటం జరిగింది.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం గంజాయి,డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం,నాటు సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, మాదకద్రవ్యాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.