calender_icon.png 13 December, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో 6వ పింకాథాన్

11-12-2025 12:45:11 AM

బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన కోసం మహిళలతో రన్

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): భారతదేశంలోని అతిపెద్ద మహి ళల రన్ అయిన పింకాథాన్.. జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ అనే గ్లోబల్ ఇన్నోవేషన్ ఆధారిత హెల్త్‌కేర్ సంస్థతో చేతులు కలిపి, భారత్‌లో బ్రెస్ట్ కాన్సర్ అవగాహనను మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్‌లో 6వ పింకాథాన్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాస్పిటాలిటీ పార్ట్‌నర్‌గా పార్క్ హయత్ సత్కారంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది.

ఫిబ్రవరి 15, 2026న పీపుల్స్ ప్లాజాలో జరగనున్న ఈ రన్.. మహిళల్లో ఫిట్నెస్, కమ్యూనిటీ భాగస్వామ్యం, ప్రివెంటివ్ హెల్త్‌ను ప్రోత్సహించే పింకాథాన్ ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తోంది. 2012లో ముం బైలో నటుడు, వ్యాపారవేత్త, ఫిట్నెస్ ప్రతినిధి మిలింద్ సోమన్ ప్రారంభించిన పిం కాథాన్, క్రీడ ద్వారా మహిళలను శక్తివంతం చేసే జాతీయ ఉద్యమంగా విస్తరించింది.

ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా మహిళలను చేరుకుని, వేల మందికి ఉచిత బ్రెస్ట్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేసి, ఆర్థికంగా బలహీన వర్గాల కాన్సర్ రోగులకు 1 కోటి రూపాయలకు పైగా నిధుల్ని సమకూర్చి, దేశవ్యా ప్తంగా బలమైన అంబాసడర్ కమ్యూనిటీనీ నిర్మించింది. జైడస్ ’ప్రివెంటివ్-ఫస్ట్’ దృక్ప థం పింకాథాన్ లక్ష్యానికి మరింత శక్తినిస్తూ, 2025-26 సీజన్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్క తా, చెన్నై మరియు ఢిల్లీ నగరాల్లో కొనసాగుతుంది.

100కిలోమీటర్ల  కేటగిరీకి పూనమ్ మెట్టా, 75కిలోమీటర్లకు దేవ్యాని హల్దర్, 50కిలోమీటర్లకు లీనా రాయ్ ప్రతినిధులుగా ఉన్నారు. 10కిలోమీటర్ల కేటగిరీకి దృష్టిహీనురాలు మార్డాకు అనిత, లైఫ్లాంగ్ 5కిలోమీటర్లకు క్యాన్సర్ను జయించిన సరితా సర్కార్ నిలుస్తున్నారు. 3కె కోసం బేబీ వేరింగ్ మదర్ ప్రీతి ఖన్నా మాస్కాట్గా వ్యవహరిస్తున్నారు. 3కిమీ నుంచి లైఫ్లాంగ్ 5కిమీ, 10కిమీ, అల్ట్రా దూరాల వరకూ అన్ని కేటగిరీలతో ఈ రన్, కొత్తగా పరుగులు ప్రారంభించే వారినీ, ప్రొఫెషనల్ అథ్లెట్లు ఇద్దరినీ సమానంగా ప్రోత్సహించే ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది.

ప్రెస్ కాన్ఫరెన్సులో పింకాథాన్ వ్యవస్థాపకుడు మిలింద్ సోమన్, సర్జికల్ ఆంకాలజిస్టు డా.మొహన వంసీ, జైడస్ లైఫ్‌సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డా. శర్విల్ పటేల్, పాల్గొన్నా రు. జైడస్ టైటిల్ పార్టనర్‌గా, హెల్ది మాస్టర్ హెల్ది స్నాకింగ్ పార్ట్‌నర్‌గా, లోటస్ హెర్బల్ సన్స్క్రీన్ పార్ట్నర్గా, లైఫ్లాంగ్ ఫిట్నెస్ పార్టనర్‌గా, సిరోనా హైజీన్ పార్టనర్‌గా, పార్క్ హయత్ హాస్పిటాలిటీ పార్టనర్‌గా, ఫుజిఫిల్మ్ బ్రెస్ట్ హెల్త్ పార్టనర్‌గా మద్దతునిచ్చాయి. ఎస్‌ఏఐ, ఫిట్ ఇండియా కార్యక్రమానికి మద్దతు అందించగా, ఐఎన్‌సీ 5 గిఫ్టింగ్ పార్టనర్‌గా చేరింది. ఈ కార్యక్రమాన్ని ఎస్‌టీఈ సమర్థవంతంగా నిర్వహించింది.