calender_icon.png 16 June, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగ నియంత్రిక.. నిద్ర అవరోధిక..

16-06-2025 12:54:56 AM

- జాతీయ రహదారిపై రంబుల్ స్టిప్స్‌తో విపరీతమైన ధ్వనులు

- రాత్రంతా నిద్రలేక ప్రజల అవస్థలు

మునగాల, జూన్ 15 : వేగ నియంత్రణతో పాటు డ్రైవర్ల నిద్రమత్తునూ వదిలిం చేందుకు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసి న రంబుల్ స్టిప్స్ (కొద్దిపాటి మందంతో కూ డిన పట్టీలు) రోడ్ సమీపంలోని ప్రజలకు రాత్రిపూట నిద్రకు ఆటంకంగా మారాయి. వెరసి వేగ నియంత్రికే నిద్రకు అవరోధికగా మారిందరడంలో ఎటువంటి సందేహం లే కుండా పోయింది.

హైదరాబాద్ _  విజయవాడ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 65) పై పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు ని త్యం జరుగుతుంటాయి. ఈ క్రమంలో వా హనాలు నెమ్మదిగా వన్ వే లో వెళ్లాలనే ఉ ద్దేశంతో పోలీసులు స్టాఫ్ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణ కు హైవేపై మూడు లేయర్లుగా రంబుల్ స్టిప్స్ ఏర్పాటు చేశారు. ఇవే నిద్రభంగానికి ప్రధాన కారణం అవుతున్నాయి.                       

మండలంలో పలుచోట్ల : ఆకుపాముల. ముకుందాపురం.మెద్దుల చెరువు.తాడువాయి. మునగాలతో పాటు జాతీయ రహదారిపై అవసరమైన చోట వీటిని ఏర్పాటు చేశారు. అయితే రంబుల్ సి ్టప్స్ పై వాహనాలు వెళ్తున్నపుడు వచ్చే శబ్దానికి రోడ్ పక్కనే ఇండ్లు కలిగిన వారికి రా త్రిపూట నిద్రాభంగం కలుగుతుంది. దీంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో ఇదే పరిస్థితి కావ డంతో పిల్లలు, వయోవృద్ధులకు నిద్ర సక్రమంగా లేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన వలసి వస్తుంది. వేగ నియంత్రణకు గ్రామ శివారులోనే ఈ రంబుల్ స్టిప్స్ ఏర్పాటు చే యాలంటున్నారు.

ఊరు మధ్యలో ఏర్పాటు చేయడాన్నీ  వ్యతిరేకిస్తున్నారు.  కేంద్ర ప్రభు త్వం పునరాలోచించి రంబుల్ స్టిప్స్ స్థానం లో ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా వాటిని తొ లగించి రాత్రిపూట నిద్రకు ఆటంకం కలగకుండా చూడాలని, లేనిపక్షంలో ఆందోళన లు చేయడానికి అయినా వెనకాడబోమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 నిద్రలేక అవస్థలు పడుతున్నాం 

ఈ రంబుల్ స్టిప్స్ వాహనాల శబ్దాలతో రాత్రిపూట నిద్ర పట్టటం లేక ఇబ్బందులు పడుతున్నాం. జనావాసాల మధ్య ఈ స్టిప్స్ ఏర్పాటు మంచిది కాదు. రోడ్డు వెంబడి ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారులు శబ్దాలు వినలేక బాధపడుతున్నారు. ఇక చిన్నపిల్లలు అకస్మాత్తుగా వచ్చే ఈ శబ్దానికి ఒక్కసారిగా వనికిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తొలగించాలి.

అక్కినపల్లి రవి, మునగాల