15-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 14 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకో ర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను మంగళవారం కోర్టు రిజిస్ట్రార్ వద్ద ప్రభుత్వ న్యాయవాదులు మెన్షన్ చేశారు. గురువారం లేదా శుక్రవారం విచారించాలని విజ్ఞప్తి చేశారు. సీజేఐ అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
రాజ్యాంగంలో నిబంధనలు లేకపోయినా..
రిజర్వేషన్లపై 50శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధననలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుబడుతూ సర్కార్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 50శాతం అంతకుమించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది.. అని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించనున్నారు.
రిజర్వేషన్ల అమలుకు ట్రిపుల్ టెస్ట్ నిర్వ హించాలని వికాస్ కిషన్‌రావు గన్లీ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొంది. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. ఎన్నికల్లో ఎంత మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై అధ్యయనం నిర్వహించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024 రాష్ట్ర జనాభాలో బీసీలు 56.33 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలింది.
42శాతం రిజర్వేషన్లకు అదే ప్రాతిపదికన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 దఖ లు పడిన అధికారాలను అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు చేసిం ది. ఇలాంటి కసరత్తును రాహుల్ రమేశ్ వాఘ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టుకు సమర్పించింది.. అని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సమర్పించనున్నారు.
న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం
బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి.. సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీతో చర్చించి మంగ ళవారం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లా డుతూ బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌పీ గురువారం విచారణకు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు మాట మార్చి వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు.