15-10-2025 12:00:00 AM
మంచిర్యాల, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి సాయి ప్రదీప్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న, పీడీ సుదీప్ మంగళ వారం తెలిపారు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో మంచిర్యాల రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీఈసీ విద్యార్థి సాయి ప్రదీప్ ప్రతిభ కనబర్చి ఈ నెల 15 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు. సాయి ప్రదీప్‌ను కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది అభినందించారు.