15-10-2025 12:00:00 AM
భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞ కుమార్
ఆదిలాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాం తి): ప్రపంచములోనే సర్వ శ్రేష్ఠ మతము బౌద్ధ బౌద్ధ దమ్మమ్ అని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజడే ప్రజ్ఞ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్ లో 69వ ధమ్మచక్ర ప్రవర్తన దివస్‌ను భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసారు.
అనంతరం పంచాశిల్ ద్వాజరోహన చేశారు. అనంతరం ప్రజ్ఞ కుమార్ మాట్లాడుతూ 14 వ అక్టోబర్ 1956 లో మహారాష్ట్రలోని నాగపూర్ నగరము లోని దిక్షా భూమి లో డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్ అయిదు లక్షల జనాలతో బౌద్ధ దమ్మాన్ని స్వికరించారు అని అన్నారు.
అప్పడి నుండి ప్రతి సంవత్సరం ధమ్మచక్ర ప్రవర్తన దినమును జరుపుకుంటామని తెలి పారు. అంబేద్కర్ కళలను సాకారం చెయ్య టానికి ప్రతి ఒక్కరు బౌద్ధ ధసమ్మాన్ని స్వీక రించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దయానంద్, కంత్రావు వాఘమరే, దయా నంద్ కంబ్లె , కుష్వర్త లాండ్గే, రాందాస్ భలేరావు, హట్కర్ రాజు పాల్గొన్నారు.