calender_icon.png 9 December, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2025 గ్రాండ్ ఫినాలే ప్రారంభోత్సవం

09-12-2025 12:00:00 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పోచారం సర్కిల్ దివ్య నగర్‌లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న స్మార్ట్ ఇండియా హ్యాకెథాన్- 2025 గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ ఎస్.ఎన్. భీమ లింగేశ్వర్ రెడ్డి సామ్రాట్ షిండే విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే జాతీయస్థాయి కార్యక్రమానికి అత్యుత్తమ కళాశాలగా ఎన్.ఎం.ఆర్.ఇ.సి ని గుర్తించి ఈ గ్రాండ్ ఫినాలే సాఫ్ట్ వేర్ ఎడిషన్ కు వేదికగా ఎంపిక చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆరుగురు చొప్పున టీములుగా ఏర్పడి పలు సాంకేతిక సమస్యలకు పరిష్కారం సూచించే దిశలో పరిశోధనలు చేస్తూ పోటీపడ్డారు.

ఈ దిశలో అత్యుత్తమ పరిశోధన చేసిన విద్యార్థుల టీంలు గ్రాండ్ ఫినాలే కు ఎంపికయ్యారు. ఈ జాతీయస్థాయి గ్రాండ్ ఫినాలే పలు రాష్ట్రాలకు చెందిన అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలలు ఎంపికయ్యాయి. 20 కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు టీం కు ఆరుగురు చొప్పున 20 టీములు పాల్గొంటున్నాయి. ఈకార్యక్రమం సాఫ్ట్ వేర్  ఎడిషన్ కు వేదికగా నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆతిథ్యమిస్తోంది.

సోమవారం నాటి ప్రారంభోత్సవ సభకు కళాశాల సెక్రటరీ నల్ల మల్లారెడ్డి హాజరు కాగా విద్య, పారిశ్రామిక ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల నేతృత్వం వహిస్తున్న ఈ కార్యక్రమంకు సిఎస్సి డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎం రాజు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాటి ప్రారంభోత్సవ సభకు నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ స్నేహ నల్ల, ప్రిన్సిపాల్ ఎం.ఎన్.వి. డాక్టర్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.