20 June, 2026 | 3:37 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విజేత గీతం

11-12-2025 01:21 AM

విజేతల బృందానికి రూ.1.5 లక్షల నగదు పురస్కారం

పటాన్ చెరు, డిసెంబర్ 10 : జాతీయ స్ఠాయి పోటీలలో గీతం విద్యార్థులు మరోసారి రాణించారు. అహ్మదాబాద్ (గుజరాత్) నోడల్ సెంటర్ లో ఇటీవల జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాక థాన్ (ఎస్‌ఐహెచ్) 2025ను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు జట్టు గెలుచుకుంది. ఆ జట్టు వినూత్న సాంకేతిక పరిష్కారాన్ని మెచ్చిన జ్యూరీ 1.5 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించింది.

బీటెక్ సీఎస్‌ఈ, ఏఐఎంఎల్ రెండో ఏడాది విద్యార్థులు కె.కృష్ణప్రియ, అబ్దుల్ బాసిత్ హసన్ షేక్, కె.అమోఘ్, కర్మన్ ఘాట్ యశ్వంత్, యుక్త చావలి, శరణ్య మదీనాలతో కూడిన విజేత బృందం ప్రభుత్వ ఈ-కన్సల్టేషన్ మాడ్యూల్ ద్వారా సమర్పించే ప్రజా వ్యాఖ్యల యొక్క సెంటిమెంట్ విశ్లేషణ కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వేదికను అభివృద్ధి చేసింది.

విధాన రూపకర్తలు సెంటిమెంట్, విధాన వైఖరిని వర్గీకరించడం, సారాంశాలను రూపొందించడం, సాక్ష్యం ఆధారిత నిర్ణయం తీసుకోవడాన్ని ప్రారంభించడం ద్వారా ముసాయిదా చట్టాలు, నిబంధనలపై పౌరుల అభిప్రాయాన్ని పెద్ద మొత్తంలో సమర్థవంతంగా విశ్లేషించడానికి ఈ ఏఐ వేదిక సహాయ పడుతుంది. ఈ బృందానికి మార్గదర్శి (మెంటార్)గా వ్యవహరించిన డాక్టర్ చంద్రశేఖర్ ఉద్దగిరి, విద్యార్థుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

తమకు వెన్నుదన్నుగా ఉంటున్న సీఎస్‌ఈ, ఏఐఎంఎల్ విభాగాధిపతులు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, వీడీసీ డిప్యూటీ డైరెక్టర్, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్-డీన్ లతో పాటు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతులకు వీడసీ కృతజ్జతలు తెలియజేసింది.