11-12-2025 01:19:45 AM
గజ్వేల్, డిసెంబర్ 10: సర్పంచ్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటిస్తూ విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హై మావతి పోలింగ్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే గజ్వేల్, ములుగు, రాయపోల్, డౌలతాబాద్ లో బుధవారం నిర్వహించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరి శీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పోలింగ్ స్టేషన్ల పిఓ, ఓపిఓలు తమకు ఇచ్చిన పోలింగ్ సామాగ్రి ని చెక్ చేసుకోవాలని, బ్యాలెట్ పేపర్ లు లెక్కబెట్టుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాలను ఉపయోగించే ప్రక్రియ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా మాస్టర్ ట్రైనర్ లను అడి గి పరిష్కరించుకోవాలని, పోలింగ్ మెటీరియల్ తీసుకుని వివిధ రూట్లలో మీకు కేటా యించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్ళిన తర్వాత పోలింగ్ స్టేషన్ లో ఫర్నిచర్, బ్యాలెట్ బాక్స్ ఆయా మెటీరియల్ అన్ని అన్ని సెట్ చేసుకోవాలన్నారు.
గురువారం ఉదయం 6 గంటలకే అన్ని సిద్ధం చేసుకుని మాక్ పో లింగ్ చేసిన తరవాత తప్పనిసరిగా 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టాల న్నారు. ప్రతి రెండు గంటలకొకసారి పోలిం గ్ శాతాన్ని తెలపాలని ఆదేశించారు. మధ్యా హ్నం ఒంటిగంట వరకు ఓట్లు వేయడానికి ఓటర్లు ఉంటే వారు ఓటు వేసిన తరవాత పోలింగ్ ముగించి బ్యాలెట్ బాక్సు కి సీల్ వే యాలని, మధ్యాహ్నం 2 గంటలకు కౌం టింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.
కౌంటింగ్ సెంటర్ లో ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది ఫోన్లకు అనుమతి లేదని కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేశాకే పై అధికారుల అనుమతితో ఫలితాలు వెల్లడించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా కరదీపికను చదివి నివృత్తి చేసుకోవాలన్నా రు. అన్ని సౌకర్యాలు ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు సమకూరుస్తారని, ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిఈఓ ను ఆదేశించారు.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో చంద్రకళ, ఆయా మండల ఎంపిడిఓ, తహసిల్దార్ తదితరులు ఉన్నారు. కాగా మధ్యాహ్నం మూడు గంటల నుండి పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆయా గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్లారు.