4 May, 2026 | 10:03 PM

ఇంకా వరదలోనే విజయవాడ

03-09-2024 01:01 AM
  1. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, నాలుగు హెలిక్యాప్టర్లు రాక
  2. డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా
  3. ప్రకాశం బరాజ్ గేట్లను ఢీకొన్న బోట్లు
  4. ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడ, సెప్టెంబర్ 2:  గత మూడు రోజులుగా విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో కురిసిన అత్యధిక వర్షపాతం (26 సెం.మీ)తో విజయవాడ తట్టుకోలేకపోయింది. దీంతోపాటు కృష్ణానదికి వరద పోటెత్తడంతో విజయవాడలోని  భవానీపురం, గొల్లపూడి, స్వాతి సెంటర్, హౌసింగ్ బోర్డు, తదితర ప్రాంతాల్లో 5 అడుగుల మేర నీరు ఇండ్లలో కి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న రామలింగేశ్వర్ నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాల్లోని ఇండ్లు ముంపు నకు గురయ్యాయి. మరోవైపు మున్నేరు వాగు పొంగడంతో ఆ నీరు వెళ్లే బుడమేరు ఎగదన్నటంతో సింగ్ నగర్, నున్న, రామవరప్పాడు, పాయకాపురం, తదితర ప్రాంతా లు ముంపులో చిక్కుకున్నాయి.

బాధితులకు ఆసరాగా..

ఆదివారం నుంచి సీఎం నారా చంద్రబా బునాయుడు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదలో చిక్కుకున్న సుమారు 3 లక్షల మందికి ధైర్యం కల్పిస్తూ  ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన సహాయ చర్యలకు ఆదేశాలిస్తున్నారు. సీఎం ఆదేశాలతో  శిబిరాలలో ఉన్న వారికి, ఇండ్ల నుంచి బయటకు రాలేని లక్షమందికి  సోమవారం ఉదయం ఉప్మా, మధ్యాహ్నం, రాత్రికి ఫ్రైడ్ రైస్ పాకెట్లను అందించినట్లు విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ విజయక్రాంతి ప్రత్యేక ప్రతిని ధికి చెప్పారు. సిద్దార్థ్ధ కాలేజీకి చెందిన 200 మంది విద్యార్థులు ఫుడ్ పాకెట్లు సిద్ధం చేసే పనిలో స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ తరఫున కూడా ఫు డ్ పాకెట్లు, ఫ్రూట్స్, పాలు కొన్ని ప్రాంతాల్లో పంచారు. మునకకు గురికాని వారు కూడా ఆహారం అందిస్తున్నారు.

రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్..

వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభు త్వం  సుమారు 100 మందికి పైగా ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపింది. ఈ బృందాలు సోమవారం ఉదయం గన్నవరం చేరుకుని అక్కడనుంచి విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరో 4 ఆర్మీ హెలీక్యాప్టర్లు కూడా విజయవాడ చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ముంపునకు ఆక్రమణలే కారణం..

గత 100 ఏళ్లలో ఒకేరోజు ఇంత భారీ వర్షాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెప్పారు. కృష్ణా నది, బుడమేరు వర ద ముంపులో విజయవాడ చిక్కుకుని పరిస్థి తి దారుణంగా మారిందన్నారు.  నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం, అనుమతులు లేని కట్టడాలు, ఆక్రమణలు పెరిగిపో వటం, బుడమేరును సాగు కోస ఆక్రమించడం, కృష్ణానది కట్ట లోపల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాల వలన వరద నీరు త్వరగా బయటకు పోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వరద తగ్గేవరకు అక్కడే..

సీఎం చంద్రబాబు మాత్రం వరద పూర్తి గా తగ్గేవరకు కలెక్టర్ కార్యాలయంలో ఉండి అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. మధ్య మధ్యలో నగరంలో బోట్‌పై పర్యవేక్షస్తూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. వారికి అండగా ఉంటామని  భరోసా ఇస్తున్నారు. 

11లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..

వరద నీటి మట్టం కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గినప్పటికీ కృష్ణానదికి, బుడమేరుకి వరద పోటు తగ్గలేదు. కృష్ణానది బ్యారే జ్ 70 గేట్లను పూర్తిగా ఎత్తి 11లక్షల 40 వేల క్యూసెక్కుల నీటిని, కాల్వల ద్వారా మరో 500 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేశారు. సాయంత్రానికి 12 లక్షల క్కూసె క్కులు వదిలే అవకాశం ఉందని, నదిలో బోట్లపై చేపలు పట్టడం, ప్రయాణం నిషేధంచినట్లు ప్రభుత్వం తెలిపింది. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇప్పటి వరకు 19 మంది మృతి..

భారీవర్షాలు, వరదల కారణంగా  రాష్ట్రం లో  ఇప్పటి వరకు 19 మంది మరణించారని, 136 పశువులు, 59,700 కోళ్లు మర ణించాయని  ప్రభుత్వ అధికారులు తెలిపా రు. 136 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించామన్నారు. 1808 కి.మీ పొడువున ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినగా,  1,72,542 హెక్టార్లలో వరిపంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగాయన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో  పాటు 41,927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించారు. 171 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు.

సహాయ చర్యల్లో 36 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంతరం సేవలు అందిస్తున్నా యి. బాధితులకు సోమవారం  3 లక్షల ఆహార ప్యాకెట్లు, తాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. 188 బోట్లు, 283 గజ ఈతగా ళ్లును ప్రభుత్వ అందుబాటులో ఉంచడంతో పాటు ఎటువంటి సహాయనికైనా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బాధితులు కం ట్రోల్ రూమ్‌లోని టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 కు ఫోన్ చేయాలని సూచించారు.  

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: చంద్రబాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి):  వరద సహాయక చర్యల్లో అధి కారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబా బు హెచ్చరించారు.  విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో  సోమవారం ఉద యం నుంచి సుమారు నాలుగు గంటల పాటు  యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి ఓదార్చారు. కొన్నిచోట్ల వాహనంలో, మిగిలిన చోట కాలికనడక వెళ్లారు. మరికొన్ని చోట్ల మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లారు. బురదలోనే కాలినడకనే పర్యటించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తాను రంగంలోకి దిగినా అధి కారులు మొద్దు నిద్ర వీడకపోతే ఎలా అంటూ చివాట్లు పెట్టారు. 

ఆహారం పంపిణీ విషయంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న కొందరు అధికారుల కారణంగా  బాధితులకు ఆహా రం అందలేదని మంత్రి తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారన్నారు.  క్షేత్రస్థాయి పర్యటనలో స్వయంగా మంత్రి పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకొని వచ్చి  వివరించినట్లు చెప్పారు. కొందరు అధికారులు  ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో  సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తూ ఆటంకాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వీఆర్‌లో ఉన్న కొల్లి ర ఘరామిరెడ్డి, విజయారావు, రఘవీరారెడ్డి, శ్రీకాంత్, సత్యానందర్, గోపాల కృష్ణ వంటి కొందరు అధికారులకు అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పనిచేయడం ఇష్టంలేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని, ప్రజల బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని తేల్చి చెప్పారు. 

ప్రకాశం బరాజ్ గేట్లను ఢీకొన్న బోట్లు

విజయవాడలోని ప్రకాశం బరాజ్‌కి రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ఈ వరదలో పెద్ద ఎత్తున్న బోట్లు కొట్టుకొస్తున్నాయి. ముందుగా ఒక బోటు కొటుకొ చ్చి బరాజ్ గేటును ఢీకొట్టింది. వెంటనే మరో మూడు బోట్లు  కొట్టుకొచ్చి బరా జ్ 3,4 గేట్లను ఢీకొన్నాయి. దీంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతం దెబ్బతిన్నది. కాగా బోట్లు కొట్టుకరావడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ

బోట్లు, హెలికాప్టర్లు వెళ్లలేని ఇరుకు ప్రాంతాలో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సిటీలోని సింగ్‌నగర్‌లో పరిస్థితి దారుణంగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. వరద బాధి తులు ఆహారం కోసం అర్తనాదాలు చేస్తున్నారు. ముంపు ప్రాంతారల్లో హెలీక్యా ప్టర్ల ద్వారా, మరికొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు.  సింగ్ నగ ర్ ఫ్లు ఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జాం  ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గర్భిణీలు, పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర కేసులను బోట్ల ద్వారా తరలిస్తున్నారు.  ఇంకా కొన్ని కాలనీలకు తాగు నీరు చేరడం లేదు.

పుకార్లు నమ్మవద్దు..

కృష్ణా నదిలో తొట్లవల్లూరు మం డలం వద్ద కొందరిని తరలిస్తున్న పడవ మునిగిపోయిందని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లో ప్రసారమవుతున్న విషయాన్ని కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి మండలంలోని అన్నవరపు లంకలో చిక్కున్న నలుగురుని ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఒక పడవలో తీసుకొ స్తుండగా నది ఒరవడికి తలకిందులయిందన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వారిని రక్షించి దగ్గరలో ఒకచెట్టుకు వద్దకు చేర్చారని తెలిపారు. తొట్లవల్లూరు తహసీ ల్దారుకు సమాచారం అందించగా మరో పడవ పంపటంతో వారందరు సురక్షితం గా సహాయ శిబిరానికి చేరినట్లు కలెక్టర్ బాలాజీ ఆ ప్రకటనలో తెలిపారు.