calender_icon.png 24 October, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలో పాము కలకలం..

22-10-2025 03:58:11 PM

భయాందోళనలకు గురైన విద్యార్థులు, ఉపాధ్యాయులు

విషపురుగులకు నిలయంగా మారిన పాత గ్రంథాలయ భవనం

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో పాము ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థినులు, ప్రధానోపాధ్యాయులు మల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం... నేడు పాఠశాల ప్రాంగణంలో ప్రార్థన చేస్తున్న సమయంలో వేదిక పై నుండి చెడుగు పాము రావడానికి గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలిపారు.

విద్యార్థులు చేసిన అలజడికి పాము వాష్ రూమ్ లోకి దూరింది. స్థానికంగా ఉన్న యువకులు పామును కొట్టి చంపేశారు. అయితే పాఠశాల ప్రాంగణానికి ఆనుకుని ఉన్న పాత గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరి అందులో మొక్కలు, వృక్షాలు, పొదలు గా మారడంతో పాములకు పాత గ్రంథాలయ భవనం పాములు, తేళ్ళు, విషపురుగులకు నిలయంగా మారింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని కూల్చివేసి కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.