22-10-2025 04:01:51 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో స్వర్గీయ దేవిరెడ్డి రామిరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన "ఉచిత కంటి పోర చిక్సిత శిబిరాన్ని" నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు, రామిరెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.