18-10-2025 12:30:48 AM
గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ ప్రసన్న నగర్ కాలనీ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ కాలనీ అధ్యక్షులు రాజు, కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు శుక్రవారం అందజేశారు. కాలనీలో ప్రధాన రహదారులు గుంతల మయంగా మారి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారాయని, అంతర్గత రోడ్లు కూడా కనీసం మట్టి పోయించి చదును చేయాలని కోరారు. అలాగే పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని, పాడైన యూజీడి చాంబర్లను బాగు చేయాలని కోరారు. లక్ష్మీ ప్రసన్న నగర్ కాలనీ సమస్యల పట్ల కమిషనర్ స్పందిస్తూ త్వరలో ప్రభుత్వ నిధులు రానున్నాయని, కాలనీలో సమస్యలను సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.