18-10-2025 01:37:48 AM
ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): అవసరాన్ని బట్టి జనాభా లెక్కల ప్రకారం 50 శాతం పెరిగితే బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని, అగ్రవర్ణాలకు 10 శాతం పెంచినప్పుడు బీసీలకు కూడా పెం చాల్సిందేనని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతుగా శుక్రవారం బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబే ద్కర్ విగ్రహం వరకు బీసీ జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్లు రాజారాం యా దవ్, దాసు సురేశ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, జేఏసీ మీడియా కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమా ల వేసి కృష్ణయ్య మాట్లాడారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యంతో పాటు సరైన వాటా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. బీసీ స మాజం పట్ల నిర్లక్ష్యం ఆపాలన్నారు. బీసీలకు సమాన హక్కులు కల్పించేవరకు తమ పోరా టం కొనసాగుతుందని చెప్పారు. బీసీలంటే చిన్నచూపు చూస్తున్నారని, తాము చదువుకుంటే ఓర్వరు, స్కాలర్ షిప్ వస్తే తట్టుకోరు, దేశంలో బతకాలంటేనే కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
రిజర్వేషన్ల అంశం సడలించే వరకు విశ్రమించేదిలేదని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి హేతుభద్దత లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా జీవో నంబర్ 9 విడుదల చేశారని, మొదటి రోజు, రెండోరోజు స్టే ఇవ్వలేదని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక స్టే ఇచ్చి బసీల నోటికాడ బుక్క లాక్కున్నారని మండిపడ్డారు. 76 ఏండ్లుగా బసీలకు అన్యాయం జరిగిందన్నా రు. 35 బీసీ, 136 కులసంఘాల ఆధ్వర్యంలో బీసీ జేఏసీ ఏర్పడిందని, ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని పేర్కొన్నారు.
శాంతియుత వాతా వరణంలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యా, వ్యాపార, వాణిజ్య అన్ని వ ర్గాల వారు బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడు తూ.. బంద్‌కు తమ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని స్పష్టంచేశారు. పార్టీ సబ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పీఎన్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. జనాభాలో సగభా గానికి పైన ఉన్న బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.
గ్రామస్థాయి నుంచి బంద్
రాష్ట్ర బంద్ ఇప్పటికే 90 శాతం విజయవంతం అయ్యిందని, ఈ బంద్ వ్యక్తుల ప్ర యోజనాల కోసం కాదని, బీసీల వ్యవస్థ కోసమని జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సామాజిక న్యా యం కోసం అన్ని సంఘాలు బీసీలకు మద్దతుగా ఒక్కతాటిపైకి వచ్చాయని, గ్రామ స్థాయి నుంచి బంద్ జరగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కుల వృత్తుల వారు రో డ్లపైకి రావాలని చెప్పారు. బీసీల బంద్‌తో ఢిల్లీ పెద్దలు కండ్లు తెరిపించాలని పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వా రు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మా ట్లాడుతూ.. ఈ బంద్‌ను విజయవంతం చేయాలలని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమన్నారు. బీసీల నోటికాడి ముద్దను అడ్డుకోవడం సరైనది కాద న్నారు. రిజర్వేషన్లను అగ్రకులాల వారు అడ్డుకోవడం మంచిది కాదన్నారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఈ బంద్ న్యాయం కోసం, ధర్మం కోసం జరుగుతున్నదని, అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు తెలపాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు ఎం నర్సయ్య, నిమ్మల వీరన్న, అజ య్‌కుమార్ యాదవ్, మందాల భాస్కర్, బుర్ర రామ్‌గౌడ్, ప్రదీప్‌గౌడ్, గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.