18-10-2025 12:30:28 AM
బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు తలపెట్టిన శనివారం రాష్ట్ర బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కులసంఘాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ కో చైర్మన్ వీజీఆర్ నారగోని, మీడియా కో-ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు.
గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. శనివారం తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ కొనసాగుతుందని తెలిపారు. బంద్‌లో దవాఖానలు, మెడికల్ షాపులకు మినహాయింపు ఉంటుందని స్పష్టంచేశారు.
శాంతియుతంగా తాము ఈ బంద్‌ను పాటిస్తున్నామని, పోలీసులు సహకరించాలని కోరారు. నారగోని మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగు తుందని చెప్పారు. సమావేశంలో బీసీ సం క్షేమ సంఘం నేతలు రామ్ కోఠి, ఉదయ్ నేత, కొండ దేవయ్య, హరిసింగ్, శారద, మో దీ రాందేవ్, రవి యాదవ్, బాలయ్య, వీరన్న, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.