18-10-2025 09:39:12 AM
అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం
బీసీ రిజర్వేషన్ల పేరుతో కొత్త నాటకం
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జవహర్ లాల్
వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే మాయమాటలు నమ్మే పరిస్థితిలో రైతులు లేరని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు భూక్య జవహర్ లాల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జవహర్ లాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నూతన చట్టాలను తీసుకువస్తుందని, రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైందన్నారు.
అయినా వారి రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి పాలన చేయకుండా కాలం వెళ్లబుచ్చేందుకు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటని, గత సంవత్సరం సన్న ధాన్యానికి బోనస్ డబ్బులను ఇప్పటి వరకు రైతుల ఖాతాలో వేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు సక్రమంగా చేస్తామంటూ తప్పుడు హామీలను ఇస్తున్న తీరు హాస్యాస్పదమని, పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం నిత్యం మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవలు పెట్టుకోవడంతోనే సరిపోతుందని, కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నాయకులు మాత్రం మాయ మాటలు చెప్పి కాలం వెల్లదిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు చీదరించుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఎన్ని మాయమాటలు చెప్పిన ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మరని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గువ్వ శరత్, తంగళ్ళపల్లి శ్రీధర్, సోనాసింగ్, రతన్, రాజు, విక్రమ్ తదితరులు ఉన్నారు.