18-10-2025 08:19:11 AM
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లం బాలమల్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలిసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) శుక్రవారం గ్రామానికి వెళ్లి బాలమల్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి,మనోధైర్యం కల్పించారు.బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.నివాళులర్పించిన వారిలో మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్లు జీడి వీరస్వామి,పాలెల్లి సురేష్,కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్,నాయకులు గోలి కోటిరెడ్డి,బౌరోజు జగన్,నల్లగుంట్ల నాగేందర్,బింగి బాలరాజు యాదవ్,సిద్ది రాము,బొల్లం బాలరాజు,ఎల్లెంల ఉమేష్,తన్నీరు ఉపేందర్,జీడి సైదులు తదితరులు ఉన్నారు.