29-10-2024 02:39:32 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బదిలీల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కళాకారులు వినతిపత్రం అందజేశారు. సోమవారం రవీంద్రభారతిలో ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి యశ్‌పాల్, పమ్మి రవి, కొప్పర్తి సురేందర్, జిల్లా నాగేశ్వరరావు, గోవింద గురవయ్య, సట్ల అంజలి, గొల్లపల్లి శిరీష, రామంచ సురేశ్, కుమ్మరి శ్రావణ్, పన్నీరు శ్రీనివాస్ పాల్గొన్నారు.