calender_icon.png 31 July, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచీ అగ్నిప్రమాదం నివేదికను బయటపెట్టాలి

30-07-2025 12:10:15 AM

బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సిగాచీ అగ్నిప్రమాదం జరిగి నెలరోజులవు తున్నా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహారిస్తోందని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. 8 మంది జాడ ఇంకా తెలియకపోవడం, శవాలను కూడా కనిపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ సిగాచీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సిగాచీ ఘటనపై వేసిన హై లెవల్ కమిటీ నివేదికను వెంటనే బయటపెట్టాలని, కోటి రూపాయల నష్టపరిహా రం వెంటనే అందించాలన్నారు.