21-10-2025 08:57:03 PM
త్వరలోనే రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభిస్తాం
మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్
మణుగూరు (విజయక్రాంతి): ప్రజల చేత చిత్కారానికి గురై అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ ఉనికి కోసం ఉబలాట పడుతున్నారని, మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ ధ్వజమెత్తారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, గ్రామాల అభివృద్ధిని చూసి ఓర్వలేక రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదంటూ ప్రజలకు అసత్యలను ప్రచారం చేస్తు మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వారు చెప్పే మాటలను, సోషల్ మీడియాలో చేసే ప్రచారాలను నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
బీఆర్ఎస్ పాలనలో నాయకులు సృష్టించిన విధ్వంస పాలనకు ప్రజలు విసిగి చెంది వారికి దిమ్మ తిరిగే విధంగా తీర్పు చెప్పిన వారి వైఖరిలో మార్పురావడం లేదన్నారు. నియోజకవర్గం సుభిక్షంగా ఉందని, భయబ్రాంతులకు గురికాకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులను ఆర్ అండ్ బి శాఖ ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. పబ్లిక్ సిటీ కోసం రోడ్లపై ఫోటోలు దిగుతూ పనికిరాని పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో లైకుల కోసం బిఆర్ఎస్ నాయకులు పోటీ పడుతున్నారని ఎద్దేవ చేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు ప్రచారాలను పక్కనపెట్టి పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు.