21-10-2025 08:52:09 PM
కాసాని కుటుంబం దాతృత్వం ప్రశంసనీయం..
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ యుపిఎస్ పాఠశాలలో హృద్యమైన కార్యక్రమం జరిగింది. స్వర్గీయ శ్రీ కాసాని వేణు జ్ఞాపకార్థంగా, వారి తల్లి శ్రీమతి కాసాని ఎల్లవ్వ పాఠశాల విద్యార్థులందరికీ టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం మొత్తం రూ.12,000 విలువ గల సహాయంగా నిర్వహించబడింది. అలాగే విద్యార్థుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలో రిపేర్ లో ఉన్న ఆర్వో ప్లాంట్ ను సుమారు రూ. 6,000 ఖర్చుతో మరమ్మతు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. వారి దాతృత్వానికి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవలు ఆదర్శప్రాయమైనవి. పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోలి రాజు, ఉపాధ్యాయులు విష్ణు, అంజయ్య, సుధాకర్, రెడ్డి శ్రీనివాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.