calender_icon.png 21 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు భూములకు పట్టాల కోసం నిరసన

21-10-2025 08:28:40 PM

భీమిని (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలం అక్కలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని నిరసన వ్యక్తం చేశారు. మండల కార్యదర్శి దుర్గం రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన పేద రైతులు గత 50 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని భూమిని ఆధారంగా చేసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. 

పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడం వలన రైతు భరోసా పంట రుణాలు పొందలేక పోతున్నామని. బయటి వారి దగ్గర అప్పులు తెచ్చుకొని సాగు వ్యవసాయానికి ఖర్చు చేస్తే అకాల వర్షాల వలన పంట నష్టం జరిగి పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలని లేని ఎడల రైతులతో కలసి పట్టాలు వచ్చేవరకు రైతులను కూడగట్టి పోరాడుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం రాజేష్, చప్పిడి అన్నారావు. దుర్గం ఇస్తారి. జుమ్మడి శ్యామ్ రావు. దుర్గం బిక్కయ్య. చప్పిడి భీమయ్య. బుర్రి సంతోష్. చప్పిడి చిన్నయ్య. జాడి పోచయ్య. చప్పిడి పెంటయ్య. జుమ్మడి సువాస్. చప్పిడి బుద్ధుల్. నజీర్. దుర్గం ఓంకార్. తదితరులు పాల్గొన్నారు.