calender_icon.png 22 October, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పివిటిజి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

21-10-2025 09:37:47 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని చించొలి గ్రామంలో మంజూరు అయిన 48 పివిటిజి ఇండ్ల మంజూరు పత్రాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, జంగు, రాథోడ్ సురేందర్, అనిల్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సుజీల్, కేమ శ్రీకాంత్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.