21-10-2025 08:37:02 PM
బెజ్జంకి: బెజ్జంకి మండలం పోతారం గ్రామ యువకులు శ్రమదానం చేసి గ్రామానికి వెళ్లే దారిలోని చెట్లను తొలగించి ప్రయాణానికి సుగమం చేశారు. బెజ్జంకి నుంచి పోతారం, శనిగరం, సిద్దిపేట, జాతీయ రహదారికి వైపు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా చెట్లు, చేమలు పెరిగి నిత్యం వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెట్ల కొమ్మలు బాగా పెరిగి రోడ్డు వైపునకు విస్తరించాయి. దీంతో రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనం కనబడని స్థితి ఏర్పడింది. రోడ్డులో వాహనాలు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో గ్రామ యువకులు కలిసి శ్రమదానం చేసి ఇబ్బందులు రోడ్డు ఇరువైపులా వున్న ముళ్ళ చెట్ల పొదలను తోలగించాలని, మంగళవారం వారంతా కలిసి తలా ఓ చేయి వేసి శ్రమదానం చేశారు. బెజ్జంకి శివారు నుంచి పొతారం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను నరికి శుభ్రం చేశారు. గ్రామస్తులు, యువకులు శ్రమదానం చేయడంతో రోడ్డు కొంత మేర శుభ్రపడి రాకపోకలకు ఎంతో సులువుగా మారింది. శ్రమదానం చేసి రోడ్డు బాగు చేసిన వారందరినీ స్థానికులు అభినందించారు. ఈ శ్రమదానంలో లింగాల శ్రీనివాస్, బోనగిరి రాకేష్, జేరుపోతుల శ్రీకాంత్, బోయిని హరీష్, గ్రామ యువకులు పాల్గొన్నారు.