21-10-2025 08:30:56 PM
మందమర్రి (విజయక్రాంతి): దీపావళి పర్వదినం వేడుకలు పట్టణంలో మండలంలోని గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ ఇంటి ఆవరణలో గుమ్మాలకు మామిడి తోరణాలు, పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి , మట్టి ప్రమిదలతో దీపాలు వెలి గించారు. వర్తక వాణిజ కేంద్రాలు వివిధ పరిశ్రమల్లో గృహాల్లో భక్తిశ్రద్ధలతో లక్ష్మీ పూజలు నిర్వహించి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో, టపాసుల మోతలతో పట్టణంలో దీపావళి పండుగ ఘనంగా నిర్వహించారు.
ఆకట్టుకున్న నరకాసుర వద
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళి పర్వదినాన్ని పురస్కరించు కొని పట్టణంలో నరకాసుర వధ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలోని శ్రీ వన దుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నరకాసుర వద వేడుకలు వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం రాత్రి ఆలయం ఆవరణలో ప్రతిష్టించిన నరకాసురునికి ఆలయ కమిటీ సభ్యులు టపాసులతో దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పట్టణంలో తొలిసారిగా నరకాసుర వధ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత గొప్పగా కార్యక్రమం చేపట్టడం జరుగు తుందన్నారు.పట్టణంలో ఏర్పాటు చేసిన నరకాసుర వద కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.