13-12-2025 12:28:01 AM
మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): కూతుర్ని అదనపు కట్నం కోసం భర్త, అతని తల్లిదండ్రులు, ఆడపడుచులు కలిసి మానసికంగా వేధిస్తున్నారని, ముగ్గురు కలిసి కూతుర్ని కొడుతున్నారని సమాచారం ఇవ్వడంతో కూతురు అత్తింటికి వెళ్లిన తండ్రిపై అల్లు డు దాడి చేసి విపరీతంగా కొట్టడంతో గార్ల మా జీ ఎంపీపీ లాలు నాయక్ మృతి చెందినట్లు మృతుని కుమారుడు ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబాబాద్ పట్టణ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
మృతుడు మాజీ ఎంపీపీ లాలు నాయక్ కుమార్తె శ్రీ సాయి లహరిని మహబూబాబాద్ పట్టణంలోని మిల్ట్రీ కాలనీలో నివసిస్తున్న గుగులోతు గాంధీ బాబుకు ఇచ్చి వివాహం జరపగా , అదనపు కట్నం కోసం ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నారని, ఈ క్రమంలో ఆమెపై తీవ్రమైన ఒత్తిడి పెంచి గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో కొడుతుండడంతో వేగలేక తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా, మృతుడు లాలు నాయక్ కొడుకు ప్రదీప్ తో కలిసి మిలిటరీ కాలనీకి చేరుకోగా, గాంధీ బాబు, తల్లి తండ్రి ముగ్గురు కలిసి అతనిపై దాడి చేసి కొట్టడంతో ఆ దెబ్బలకు లాలు నాయక్ మరణించాడని ఫిర్యాదు చేశారు.